ఎండు గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2022-08-10T05:59:31+05:30 IST

ఎండు గంజాయి పట్టివేత

ఎండు గంజాయి పట్టివేత

రూ.55లక్షల విలువైన గంజాయి, వాహనం స్వాధీనం

ఒకరి అరెస్టు, పరారీలో మరొకరు : డీసీపీ వెంకటలక్ష్మి 

నర్సంపేట టౌన్‌, ఆగస్టు 9 : భద్రాచలం నుంచి నారాయణఖేడ్‌ కు ఎండు గంజాయి తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్‌ ఈస్ట్‌జోన్‌ డీసీపీ కె.వెంక టలక్ష్మి తెలిపారు. వరంగల్‌ జిల్లా నర్సంపేట పోలీస్‌స్టేషన్‌లో మంగళ వారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలను డీసీపీ వెల్లడించా రు. నర్సంపేట పట్టణంలోని పాకా లరోడ్‌ సెంటర్‌లో మంగళవారం ఉదయం బొలెరో వాహనం పాకాల వైపు నుంచి నర్సంపేటకు వస్తోంది. అక్కడే వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి బొలెరో వాహనంలోని వ్యక్తులు తప్పించుకునేందుకు యత్నించగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. ఈ క్రమంలో ఒకరు పోలీసులకు పట్టుబడగా, మరొకరు పరారయ్యారు. వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 278 ప్యాకెట్లలో చుట్టిన 550కిలోల ఎండు గంజాయి లభ్యమైంది. పట్టుబడిన వ్యక్తిని విచారించగా, నాణారా యణఖేడ్‌ జిల్లా పిప్రి గ్రామానికి చెందిన  వడ్తా హన్మానాయక్‌, అదే గ్రామానికి చెందిన అతడి స్నేహితుడు మారుతితో కలిసి భద్రాచలం సమీప గ్రామాల్లో తక్కు వ ధరకు గుర్తుతెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేసి నారాయణఖేడ్‌ ప్రాంతంలో ఎక్కువ ధరకు విక్రయించడానికి తీసుకెళ్తున్నట్లు ఒప్పుకున్నాడు. పట్టుబడిన 550కిలోల ఎండు గంజాయి విలువ రూ.55.50లక్షలు ఉంటుందని గంజాయితోపాటు బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకొని, నిందితుడు హన్మానా యక్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ వివరించారు. పరారీలో ఉన్న మారుతీపై కేసు నమోదు చేసి అతడి కోసం గాలిస్తున్నామని తెలిపారు.  గంజాయిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన నర్సంపేట ఏసీపీ సంపత్‌రావు, టౌన్‌ సీఐ పులి రమేష్‌గౌడ్‌, ఎస్సై సురేష్‌, కానిస్టేబుళ్లు ఎమ్డీ కలీముద్దిన్‌, కె.సునిల్‌, కె.రవిని డీసీపీ అభినందించారు. 

ఫకాగా గంజాయిని స్వాధీనం చేసుకున్న విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ముందుగానే గ్రహించి ఈనెల 7న ప్రచురించింది. ‘పోలీసుల అదుపులో గంజాయి ముఠా?’ అనే శీర్షికన ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైంది. అయితే పోలీసులు పూర్తి పూర్తిదర్యాప్తు తర్వాత నిందితుల అరెస్టు చూపినట్లు సమాచారం. 

Updated Date - 2022-08-10T05:59:31+05:30 IST