గుంటూరులో భారీగా గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2020-07-09T01:40:00+05:30 IST

జిల్లా కేంద్రంలో భారీగా గంజాయి పట్టుబడింది. అర్బన్ పోలీసులు పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకెళితే.. ప్రకాశం బ్యారేజీ వద్ద గుంటూరు అర్బన్ పోలీసులు

గుంటూరులో భారీగా గంజాయి పట్టివేత

గుంటూరు: జిల్లా కేంద్రంలో భారీగా గంజాయి పట్టుబడింది. అర్బన్ పోలీసులు పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకెళితే.. ప్రకాశం బ్యారేజీ వద్ద గుంటూరు అర్బన్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో విశాఖ జిల్లా నుంచి ఓ వాహనంలో గంజాయిని తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. గంజాయిని తరలిస్తున్న ఎనిమి మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 92 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Updated Date - 2020-07-09T01:40:00+05:30 IST