Abn logo
Sep 17 2020 @ 19:48PM

పాక్ ఆటగాడి ఫొటోను బ్లర్ చేసి పోస్టు చేసిన గంగూలీ

Kaakateeya

షార్జా: ఈ నెల 19 నుంచి యూఏఈలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభం కాబోతోంది. ఇందుకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ గతవారం దుబాయ్ చేరుకున్నాడు. నిబంధనల ప్రకారం క్వారంటైన్ ముగించుకున్న అనంతరం కొవిడ్ టెస్టు కూడా చేయించుకున్న గంగూలీ.. ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్, ఐపీఎల్ మాజీ చీఫ్ రాజీవ్ శుక్లా, సీఈవో హేమాంగ్ అమిన్‌, స్థానిక క్రికెట్ బోర్డు అధికారులతో కలిసి ఐపీఎల్ వేదికల్లో ఒకటైన షార్జా క్రికెట్ స్టేడియాన్ని సందర్శించాడు.  


అక్కడి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన గంగూలీ.. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. వాటిలో అంతా బాగానే ఉన్నప్పటికీ ఫొటో వెనక ఉన్న ఓ హోర్డింగ్ బ్లర్ చేసి ఉంది. ఆ హోర్డింగ్‌లో ఉన్నది పాకిస్థాన్ ఆటగాడని తెలుస్తున్నా, అతడెవరన్నది మాత్రం గుర్తుపట్టలేనంతగా బ్లర్ చేసి ఉంది. దీంతో ఇప్పుడీ విషయం వైరల్ అయింది.

Advertisement
Advertisement
Advertisement