Abn logo
Mar 4 2021 @ 00:37AM

అదానీ చేతికి గంగవరం పోర్టు!

ఈక్విటీలో 31.5 వాటా కొనుగోలు.. డీల్‌ విలువ రూ.1,954 కోట్లు


హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లోని రేవులపై అదానీ గ్రూపు పట్టు బిగిస్తోంది. నవయుగ గ్రూపు నుంచి ఇటీవల కృష్ణపట్నం రేవును కొనుగోలు చేసిన అదానీ గ్రూపు కంపెనీ అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్స్‌ లిమిటెడ్‌ (ఏపీఎ్‌సఈజడ్‌ఎల్‌) తాజాగా, రాష్ట్రంలోని గంగవరం పోర్టు ఈక్విటీలో 31.5 శాతం కొనుగోలు చేసింది. ప్రముఖ పీఈ సంస్థ వార్‌బర్గ్‌ పింకస్‌ అనుబంధ సంస్థ విండీ లేక్‌సైడ్‌ ఇన్వె్‌స్టమెంట్స్‌ నుంచి అదానీ పోర్ట్స్‌ ఈ వాటాను రూ.1,954 కోట్లకు కొనుగోలు చేసింది. రెగ్యులేటరీ సంస్థలు ఆమోదంతో ఈ ఒప్పందం అమల్లోకి రానుంది. 


మెజారీటీ వాటాపై కన్ను: విశాఖ సమపంలోని గంగవరం పోర్టును రాష్ట్రానికి చెందిన డీవీఎస్‌ రాజు ప్రమోట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన,  ఆయన కుటుంబ సభ్యుల చేతిలో 58.1 శాతం వాటా ఉంది. అదానీ గ్రూపు ఈ వాటా కొనుగోలు కోసం కూడా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఇంకో 10.4 శాతంవాటా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేతిలో ఉంది. ఈ చర్చలు ఫలిస్తే ఆంధ్ర ప్రదేశ్‌లోని రెండు ప్రధాన ఓడ రేవులు కృష్ణపట్నం, గంగవరం అదానీల చేతికి వచ్చినట్టే. వీటికి తోడు రాష్ట్రం ప్రభుత్వం తలపెట్టిన కొన్ని కొత్త రేవుల నిర్మాణానికి అదానీ గ్రూపు ఆసక్తి చూపిస్తోంది. గంగవరం పోర్టు తదుపరి అభివృద్ధిలో అదానీ గ్రూపు భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తున్నామని కంపెనీ చైర్మన్‌ రాజు చెప్పారు. 

Advertisement
Advertisement
Advertisement