గాంధీ ఘటనలో కీలక ఆధారాలు.. మరో బాధితురాలు ఆచూకీ ఏది?

ABN , First Publish Date - 2021-08-17T23:16:27+05:30 IST

గాంధీ ఘటనలో కీలక ఆధారాలు.. మరో బాధితురాలు ఆచూకీ ఏది?

గాంధీ ఘటనలో కీలక ఆధారాలు.. మరో బాధితురాలు ఆచూకీ ఏది?

హైదరాబాద్: చికిత్స కోసం వెళ్లిన అక్కాచెల్లెళ్లపై గాంధీ ఆసుపత్రిలో సామూహిక అత్యాచారం జరిగిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది.  కేసు నమోదైన వెంటనే రంగంలోకి దిగిన చిలకలగూడ పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. గాంధీ ఆస్పత్రి నుంచి బాధిత మహిళ అక్కను పోలీసులు సీసీ ఫుటేజ్‌లో గుర్తించారు. ఆమె ఎటువైపు వెళ్ళింది అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు... కనిపించకుండా పోయిన అక్కకోసం అన్ని వైపులా గాలిస్తున్న పోలీసులకు కొన్ని కీలక మైన ఆధారాలు సేకరించి ఆ దిశగా పోలీసులు అరా తీస్తున్నారు. నిజంగా వీరిద్దరిపై అత్యాచారం జరిగిందా లేదా  చెల్లెలిని వదలి పెట్టి అక్క మిస్ అవ్వడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి?. 


ఈ నెల 5న చికిత్స కోసం మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చిన బాధిత మహిళ ఆమె అక్క బావ తో గాంధీ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ నెల 4 నుండి గాంధీ ఆస్పత్రిలో బాధితురాలి బావ రోగి నరసింహులతో ఆయన భార్య చెల్లెలు ఇద్దరు రోగి బంధువులు గాంధీ‌లో ఉన్నారు.. కిడ్నీ సమస్యతో నరసింహులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రోగిని 7వ ఫ్లోర్‌కు షిఫ్ట్ చేసినా తర్వాత ఈ  ఇద్దరు మహిళలను కిడ్నాప్ చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వద్ద ఎవ్వరూలేకపోవడంతో ఈనెల 11వ తేదీన నరసింహులు సెల్ఫ్ డిశ్చార్జ్ అయి బయటికి వచ్చారు. ఇంటికి వెళ్లి ఇద్దరు కనిపించక పోవడం ఆ తర్వాత  చెల్లి అపస్మారక స్థాయిలో ఉన్న విషయం తెలుసుకున్న స్థానికులు వీళ్ళకు తెలిసిన మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మిత్రుడు గాంధీ ఆసుపత్రిలో ఎక్స్రే డిపార్ట్మెంట్లో టెక్నీషియన్‌గా పని చేస్తున్న ఉమ మహేశ్వర్  తెలుపగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 


ఆ వెంటనే ఎక్స్-రే ల్యాబ్ టెక్నీషియన్ ఉమ మహేశ్వర్ నరసింహులు కుమారుడికి సమాచారం అందించాడు. నరసింహులు కుమారుడు వచ్చి బాధిత మహిళ తన పిన్ని‌ని ఆరా తీయగా తనను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేశారని వాపోయింది. దీంతో మహబూబ్ నగర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేస్తే అక్కడ తీసుకోలేదు. తమ పరిధిలోకి రాదని, హైదరాబాద్‌ చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తిప్పి పంపించారు. మహబూబ్ నగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చెయ్యలేదు. మహబూబ్‌నగర్ పోలీసులు హైదరాబాద్ వెళ్ళమని చెప్పడంతో బాధిత యువతి చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది వెంటనే ఫిర్యాదు స్వీకరించి విచారణ చేపట్టారు బాధితురాలి స్టేట్ మెంట్ రికార్డ్ చేపట్టారు. తదుపరి వైద్య పరీక్షలు విచారణ నిమిత్తం బాధిత మహిళలు భరోసా సెంటర్‌కి పంపించారు. 


ఈ కేసు దర్యాప్తు కోసం నాలుగు పోలీసు బృందాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు కాల్ రికార్డు పరిశీలిస్తున్నారు. బాధిత మహిళపై అత్యాచారం జరిగిందా లేదా అనేది వైద్య పరీక్షల అనంతరం క్లారిటీ వస్తుంది. లాబ్ టెక్నీషయన్ ఎక్స్ రే డిపార్ట్‌మెంట్ ఉమ మహేశ్వర్‌ను విచారించారు. సెక్యురిటీ గార్డ్‌తో పాటు ఇంకా ఈ కేసులో ఎవ్వరు ఉన్నారు అనే కోణంలో విచారణ చేస్తున్నారు. గాంధీ ఆసుపత్రి నుండి బాధిత మహిళా అక్క ఎక్కడకి వెళ్ళింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అక్కా చెల్లెలు ఇద్దరిని సెల్ఫ్ డిశ్చార్జి అయిన నరసింహులు వెతికాడు కానీ ఆచూకీ లభించలేదు. తమ విచారణలో మహిళలు అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ కళ్ళు సేవించే అలవాటు ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 


ఇద్దరికి కళ్ళు తాగే అలవాటుకి ఉండటంతో వీరు కనిపించకుండా పోయిన బంధువులు వెంటనే స్పందించలేదు. రెండురోజులు రాకపోవడం చెల్లెలు అపస్మారక స్థితిలో ఉన్న విషయం తెలుసుకున్న బంధువులు చెల్లి ఇచ్చిన సమాచారం మేరకు  చిలకలగూడ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు కనిపించకుండా పోయిన రోజు ఇద్దరు అక్కా  చెల్లెల్లు  సీసీ కెమెరాల్లో రికార్ట్ అవ్వడంతో అత్యాచారంపై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్కసారిగా ఈ అక్క చెల్లిల్లపై అత్యాచారంపై  రెండు రాష్ట్రాల్లో సంచలనంకావడంతో పోలీసులు ఆరు టీంలు ఎంక్వైరీ 

చేస్తున్నారు. 


గాంధీ ఆసుపత్రిలో అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ఆరా తీస్తున్నారు. మంగళవారం గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్  రాజారావుతో మహిళా కమిషన్  ఛైర్మెన్ సునీత లక్ష్మారెడ్డి భేటీ అయ్యారు. ఆసుపత్రిలోని చీకటి రూమ్ ఎక్కడ ఉందనే విషయమై కూడా సూపరింటెండ్‌తో కలిసి ఆమె పరిశీలించారు. గాంధీ ఆస్పత్రి నుంచి బాధిత మహిళ అక్కను పోలీసులు సీసీ ఫుటేజ్‌లో గుర్తించారు. ఆమె ఎటువైపు వెళ్ళింది అనే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో అనుమానితులు ఉమా మహేశ్వర్‌తో పాటు ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిని పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో మహేశ్వర్‌తో పాటు ఒక సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులపై 342 ,376(d) , 328 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గాంధీ ఆస్పత్రిలో జరిగిన అత్యాచార ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ల్యాబ్ టెక్నీషియన్ ఉమామహేశ్వర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా సెక్యూరిటీ గార్డు పరార్ అయ్యారు. ఉమామహేశ్వర్‌, సెక్యూరిటీ గార్డ్ కలిసి అత్యాచారం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న సెక్యూరిటీ గార్డ్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - 2021-08-17T23:16:27+05:30 IST