గంభీర్ చాలా టాలెంటెడ్.. ఇంకా ఆడాల్సింది: వెంగ్‌సర్కార్

ABN , First Publish Date - 2020-05-24T04:09:40+05:30 IST

భారత మాజీ ఓపెనర్, బీజేపీ నేత గౌతం గంభీర్‌పై మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ ప్రశంసలు కురిపించాడు.

గంభీర్ చాలా టాలెంటెడ్.. ఇంకా ఆడాల్సింది: వెంగ్‌సర్కార్

న్యూఢిల్లీ: భారత మాజీ ఓపెనర్, బీజేపీ నేత గౌతం గంభీర్‌పై మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ ప్రశంసలు కురిపించాడు. గంభీర్ చాలా నైపుణ్యం గల క్రికెటరని, అతనికి రావలసిన పేరుప్రఖ్యాతులు రాలేదని వెంగ్‌సర్కార్ అభిప్రాయపడ్డాడు. గంభీర్ ఇంకొంత కాలం భారత్‌కు ప్రాతినిధ్యం వహించాల్సిందని అన్నాడు. ‘గంభీర్‌కు చాలా టాలెంట్ ఉంది. కానీ తన కోపాన్ని, ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకోలేడు’ అని ఆయన చెప్పాడు. 2003లో భారత్‌ తరఫున తొలిసారి ఆడిన గంభీర్.. 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20ల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు.

Updated Date - 2020-05-24T04:09:40+05:30 IST