అందుకే రాజీనామా చేశా: గల్లా అరుణ కుమారి

ABN , First Publish Date - 2020-10-02T01:16:51+05:30 IST

వ్యక్తిగత కారణాలతోనే తెలుగుదేశం పాలిట్‌బ్యూరోకు రాజీనామా చేసినట్లు గల్లా అరుణ కుమారి తెలిపారు. మీటింగ్‌లకు వెళ్లేది.. వచ్చేది

అందుకే రాజీనామా చేశా: గల్లా అరుణ కుమారి

తిరుపతి: వ్యక్తిగత కారణాలతోనే తెలుగుదేశం పాలిట్‌బ్యూరోకు రాజీనామా చేసినట్లు గల్లా అరుణ కుమారి తెలిపారు. మీటింగ్‌లకు వెళ్లేది.. వచ్చేది కష్టంగా ఉందని చెప్పారు. అంతే తప్ప ఏ కారణాలు లేవన్నారు. పార్టీలు మారే తత్వం తమకెప్పుడు లేదని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ లేకుండా పోయే పరిస్థితి వచ్చింది కాబట్టే తెలుగుదేశంలో చేరామన్నారు. ఎక్కడ ఉన్న నిబద్ధతతో ఉంటామని పేర్కొన్నారు. ఇక తెలుగుదేశంతోనే ఉంటాను.. ఎక్కడికి వెళ్లనని వెల్లడించారు. టీడీపీని రీ ఆర్గనైజ్ చేస్తున్నారన్నారు. మంచి వారిని పెట్టుకోవటానికి పార్టీ అధినేత చంద్రబాబుకు వెసులుబాటు ఇచ్చి.. సహకరించాలనే ఉద్దేశంతోనే పాలిట్‌బ్యూరోకు రాజీనామా చేసినట్లు ఏబీఎన్‌తో గల్లా అరుణ స్పష్టం చేశారు.

Updated Date - 2020-10-02T01:16:51+05:30 IST