సీబీఐ వలలో గెయిల్‌ డైరెక్టర్‌

ABN , First Publish Date - 2022-01-17T08:55:38+05:30 IST

సీబీఐ వలలో గెయిల్‌ డైరెక్టర్‌

సీబీఐ వలలో గెయిల్‌ డైరెక్టర్‌

రూ.50 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టివేత

న్యూఢిల్లీ: సీబీఐ వలలో పెద్ద అవినీతి తిమింగలం పడింది. రూ.50 లక్షల లంచం తీసుకుంటూ ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్‌ ఇండియా మార్కెటింగ్‌ డైరెక్టర్‌ రంగనాథన్‌ సీబీఐకి అడ్డంగా దొరికిపోయారు. ఢిల్లీలోని ఆయన ఆఫీ సు, నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో  రూ.1.25 కోట్ల నగదు, రూ.1.25 కోట్ల విలువైన నగలు, ఇతర ఆస్తుల పట్టుబడ్డాయి. సీబీఐ చరిత్రలో ఇంత పెద్ద భారీ అవినీతి తిమింగలం పట్టుబడడం ఇదే మొదటిసారని భావిస్తున్నారు. గెయిల్‌ ఉత్పత్తి చేసే కొన్ని పెట్రో రసాయనాలను డిస్కౌంట్‌ ధరతో ప్రైవేటు సంస్థలకు విక్రయించేందుకు రంగనాథన్‌ ఈ దందా కొనసాగిస్తున్నట్టు సీబీఐ పేర్కొంది. ఈ విషయంలో రంగనాథన్‌కు సహకరిస్తున్న మరో ఐదుగురు మధ్యవర్తులు, ప్రైవేటు కంపెనీల యజమానుల్ని కూడా సీబీఐ అరెస్టు చేసింది. 

Updated Date - 2022-01-17T08:55:38+05:30 IST