Abn logo
Feb 26 2021 @ 16:37PM

కుక్కల సమాచారం ఇవ్వండి.. రూ.3.6కోట్లు గెలుచుకోండి!

వాషింగ్టన్: ప్రముఖ పాప్ సింగర్ లేడీ గాగా తాజాగా భారీ ఆఫర్‌ను ప్రకటించారు. చోరీకి గురైన తన కుక్కల సమాచారాన్ని తెలిపిన వారికి రూ.3.6కోట్లను ఇస్తానని వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. లేడీ గాగాకు ఫ్రెంచ్ బుల్‌డాగ్స్ అంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే ఆమె మూడు ఫ్రెంచ్ బుల్‌డాగ్స్‌ను  పెంచుకుంటున్నారు. వాటిని చూసుకోవడానికి ఇద్దరు సంరక్షకులను కూడా ఆమె నియమించారు. కాగా.. వాటిని వాకింగ్‌కు తీసుకెళ్లిన సమయంలో కొందరు దుండగులు.. సంరక్షకుడిపై కాల్పులు జరిపి, కోజీ, గుస్తవ్ అనే శునకాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 9.40 గంటలకు లాస్ ఏంజిల్స్‌లో చోటు చేసుకుంది.


దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని దుండగుల దాడిలో గాయపడ్డ సంరక్షకుడిని ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా మూడో శునకాన్ని దుండల బారి నుంచి రక్షించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు చెప్పారు. ఇదిలా ఉంటే.. చోరీకి గురైన శునకాలను వెతికే పనిలో పోలీసులు బిజీగా ఉండగా.. లేడీ గాగా కూడా తన ప్రయత్నాలను మొదలుపెట్టారు. చోరీకి గురైన తన శునకాల సమాచారాన్ని తెలిపిన వారికి 5లక్షల డాలర్ల(భారత కరెన్సీలో రూ.3.6కోట్ల)ను బహుమతిగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. 


Advertisement

అమెరికా నగరాల్లోమరిన్ని...

Advertisement
Advertisement