జూన్ 5 నుంచి మసీదుల్లో ప్రార్థ‌న‌ల‌కు అనుమ‌తి..

ABN , First Publish Date - 2020-05-30T18:13:28+05:30 IST

బ‌హ్రెయిన్‌లోని మ‌సీదుల్లో జూన్ 5 నుంచి శుక్ర‌వారం ప్రార్థ‌న‌ల‌కు అనుమ‌తి ఇస్తున్న‌ట్లు మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్‌, ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండొమెంట్స్ వెల్ల‌డించింది.

జూన్ 5 నుంచి మసీదుల్లో ప్రార్థ‌న‌ల‌కు అనుమ‌తి..

మ‌నామా: బ‌హ్రెయిన్‌లోని మ‌సీదుల్లో జూన్ 5 నుంచి శుక్ర‌వారం ప్రార్థ‌న‌ల‌కు అనుమ‌తి ఇస్తున్న‌ట్లు మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్‌, ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండొమెంట్స్ వెల్ల‌డించింది. కింగ్ హ‌మ‌ద్ బిన్ ఇసా అల్ ఖ‌లీఫా ఆదేశాల మేర‌కు మ‌సీదుల్లో శుక్ర‌వారం ప్రార్థ‌న‌ల‌కు అనుమ‌తి ల‌భించింది. అయితే, మ‌సీదుల్లో ప్రార్థ‌న‌ల స‌మ‌యంలో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని క‌రోనా నియంత్ర‌ణ‌పై ఏర్పాటైన ఆ దేశ సుప్రీం క‌మిటీ సూచించింది. మార్చి నెల‌లో కోవిడ్ -19 విజృంభణ నేప‌థ్యంలో బ‌హ్రెయిన్ వ్యాప్తంగా మసీదుల్లో ప్రార్థ‌న‌ల‌ను నిషేధించ‌డం జ‌రిగింది. అప్ప‌టి నుంచి జ‌నాలు త‌మ‌ ఇళ్ల‌లోనే ప్రార్థ‌న‌లు చేసుకుంటున్నారు. ప‌విత్ర రంజాన్ మాసంలో కూడా అలాగే చేశారు.   


Updated Date - 2020-05-30T18:13:28+05:30 IST