Abn logo
Jul 11 2020 @ 16:39PM

మాస్క్ పెట్టుకోమంటే.. డ్రైవర్‌ను కొట్టి చంపిన ప్రయాణికులు!

బయోన్నె: మాస్క్ ధరించమని అడిగినందుకు ప్రయాణికులు డ్రైవర్‌ను కొట్టి చంపిన ఘటన ఫ్రాన్స్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఫ్రాన్స్‌కు చెందిన 59ఏళ్ల ఫిలిప్పే మంగీల్లాట్ బస్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మాస్క్ తప్పనిసరి ఆదేశాలు ఫ్రాన్స్ లో అమలులో ఉన్నాయి. దీంతో బయోన్నె ప్రాంతంలో బస్ ఎక్కిన ముగ్గురు ప్రయాణికులను ఫిలిప్పే.. మాస్క్ ధరించాలని కోరాడు. వారు అందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ముగ్గురు ప్రయాణికులను బస్ దిగాల్సిందిగా ఫిలిప్పే కోరాడు. దీంతో ఆగ్రహానికిలోనైన సదరు ప్రయాణికులు.. ఫిలిప్పేపై చెయి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఫిలిప్పే తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఫిలిప్పేను ఆసుపత్రికి తరలించారు. ఫిలిప్పే తలకు బలమైన గాయం కావడంతో బ్రెయిన్ డెడ్ అయిందని డాక్టర్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల అనుమతి తీసుకుని డాక్టర్లు శుక్రవారం రోజు వెంటిలేటర్లను తొలగించారు. దీంతో ఫిలిప్పే కన్నుమూశాడు. కాగా.. ఫిలిప్పే మీద దాడి చేసిన ముగ్గురు ప్రయాణికులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement
Advertisement