గ్రేటర్ ఉచిత మంచినీటి పథకం అమలు వేగవంతం

ABN , First Publish Date - 2021-01-24T03:41:48+05:30 IST

గ్రేటర్‌లో ఉచిత మంచినీటి పథకం అమలును జలమండలి వేగవంతం చేసింది. మీటర్ ఏర్పాటు, ఆధార్ అనుసంధానం ప్రక్రియ వేగవంతం చేసింది. వినియోగదారుల ఇంటి వద్దకే..

గ్రేటర్ ఉచిత మంచినీటి పథకం అమలు వేగవంతం

హైదరాబాద్:  గ్రేటర్‌లో ఉచిత మంచినీటి పథకం అమలును జలమండలి వేగవంతం చేసింది. మీటర్ ఏర్పాటు, ఆధార్ అనుసంధానం ప్రక్రియను వేగవంతం చేసింది. వినియోగదారుల ఇంటి వద్దకే వెళ్లి ఆధార్ అనుసంధానం చేయాలని నిర్ణయించింది. మీ సేవలో ఆధార్, క్యాన్ నెంబర్లు అనుసంధానం చేసుకోవచ్చని జలమండలి ఎండీ తెలిపారు. క్యాన్ నెంబర్‌కు ఆధార్ అనుసంధానం చేస్తేనే పథకానికి అర్హులని చెప్పారు. డొమెస్టిక్ స్లమ్ వినియోగదారులకు డిసెంబర్ 1 నుంచి ఉచితంగా మంచినీరు అందిస్తామని జలమండలి ఎండీ పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-24T03:41:48+05:30 IST