Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎఫ్‌పీఐలు... దృష్టి వీటివేపే...

హైదరాబాద్ : కరోనా కొత్త వేరియంట్‌ ఆందోళనతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. ఆర్థికవ్యవస్థలు మళ్లీ గందరగోళంలోకి వెళ్లాయి. భారత్‌లో క్రమంగా అన్‌లాక్‌ అవుతున్న ట్రేడ్‌ తిరిగి లాకింగ్‌ పొజిషన్‌లోకి వెళ్లే ప్రమాదంలో పడనుందన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి. గత నెలన్నర రోజులుగా, అన్‌లాక్‌ థీమ్స్‌లో ఎఫ్‌పీఐలు(ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు) పెట్టుబడులు పెంచుతూ వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు... పరిస్థితి తలకిందులు అవుతుండడంతో... కాస్త ఆందోళన కనిపిస్తోంది. అక్టోబరు 1 - నవంబరు 15 మధ్య... రిటైల్, ఎయిర్‌లైన్స్, హోటల్, ఆటో స్టాక్స్‌లో ఎఫ్‌పీఐలు పెట్టుబడులు పెంచారు. మొత్తం 1.17 బిలియన్ డాలర్ల (రూ. 8,800 కోట్లు)ను నికరంగా గుమ్మరించారు.


కాగా... మొత్తం మార్కెట్‌‌పరంగా చూస్తే మాత్రం... ఇదే కాలంలో, భారతీయ  ఈక్విటీల్లో 2.1 బిలియన్ డాలర్ల(రూ. 15,850 కోట్లు)తో నెట్‌ సెల్లర్స్‌గా ఉన్నారు. ఈ 45 రోజుల్లో, 'అన్‌లాక్' ట్రేడ్‌తో లింక్‌ అయిన కంపెనీల ఏయూఎం పది శాతం  పెరిగి, 60.2 బిలియన్ డాలర్లకు చేరుకోగా, ఎఫ్‌పీఐల మొత్తం ఈక్విటీ పోర్ట్‌ఫోలియోల విలువ మూడు శాతం పెరిగింది. రెవెన్యూస్‌ ప్రీ-కొవిడ్‌ స్థాయిలకు చేరుకోవడంతో, కన్జ్యూమర్‌ ఫోకస్డ్‌ స్టాక్స్‌లో బెట్స్‌ను ఎఫ్‌పీఐలు పెంచారు. ఈ నెల... మొదటి పదిహేను  రోజుల్లో... రిటైల్ స్టాక్స్‌లోకి 750 మిలియన్ డాలర్ల(రూ. 5,625 కోట్లు)ను  తీసుకొచ్చారు. ఏ ఇతర రంగంతో పోల్చినా... ఇదే అత్యధికం.  అంతేకాదు... మల్టీ-మంత్‌ హై కూడా. ఎఫ్‌పీఐల రిటైల్ స్టాక్స్‌ ఈక్విటీ ఏయూఎం... ఈ నెల 15 నాటికి 13.89 బిలియన్ డాలర్లకు చేరిన నేపధ్యంలో, గత మూడు నెలల్లో 33 % వృద్ధి చెందింది. ఈ నెల మధ్య నాటికి ఎఫ్‌పీఐ  పోర్ట్‌ఫోలియోలో రిటైల్ వెయిటేజీ 2.02 % కు పెరిగింది. ఇది కూడా మల్టీ-ఇయర్‌ హై లెవెల్ కావడం గమనార్హం‌. కిందటి  త్రైమాసికంలో రిటైల్ కంపెనీల కామెంటరీలు, ఫైనాన్షియల్‌ పెర్ఫార్మెన్స్‌ ప్రోత్సాహకరంగా ఉండి, పెట్టుబడిదారుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించాయి. ఈ క్రమంలోనే... ఈ స్టాక్స్‌పై ఎఫ్‌పీఐల దృష్టి మరింతగా  పెరిగింది. ఈ నెల 15 నాటికి, ఏవియేషన్‌ సెక్టార్‌ వెయిటేజీని 0.34 శాతానికి ఎఫ్‌పీఐలు  పెంచారు. దీర్ఘకాలిక సగటు కంటే ఇది ఏడు బీపీఎస్ అధికం. అక్టోబరు-నవంబరులో ట్రాఫిక్‌లో స్ట్రాంగ్‌ రికవరీ ఉండడంతో, ఈ రంగంలో పెట్టుబడులు పెరిగాయి. 

Advertisement
Advertisement