Advertisement
Advertisement
Abn logo
Advertisement

విద్యుత్‌ కార్ల తయారీలోకి ఫాక్స్‌కాన్‌

తైపీ: స్మార్ట్‌ఫోన్స్‌ తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్‌... విద్యుత్‌ కార్ల తయారీలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది.  ఈ కంపెనీ ఇప్పటికే యాపిల్‌ కంపెనీకి స్మార్ట్‌ఫోన్లు కాంట్రాక్టు పద్ధతిలో తయారుచేస్తోంది. అదే తరహాలో చై నా,అమెరికా, యూరప్‌, ఇతర మా ర్కెట్ల కోసం ఫాక్స్‌కాన్‌ టెక్నాలజీ గ్రూ ప్‌ విద్యుత్‌ కార్లు తయారుచేస్తుందని కంపెనీ చైర్మన్‌ యంగ్‌ లియూ ప్రకటించారు. తమ మార్కెట్‌ ప్రాధాన్యతలకు అనుగుణంగా కార్ల కంపెనీలు కారు స్వరూపంలో గాని, ఫీచర్లలో గాని మార్పులు చేయించుకోవచ్చన్నా రు. ఇటలీ డిజైన్‌ కంపెనీ పిన్‌ఇన్‌ఫారినా కోసం తయారుచేస్తున్న మోడల్‌-ఈ సెడాన్‌ 2023లో మార్కెట్లోకి రానుందని తెలిపింది. ఈ కారు ఒకసారి చార్జి చేస్తే 750 కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది. 

Advertisement
Advertisement