Abn logo
Aug 25 2020 @ 10:56AM

యువతి పువ్వు కోసిందని గ్రామస్థులు ఏం చేశారంటే...

Kaakateeya

40 మంది దళిత కుటుంబాల సామాజిక బహిష్కరణ

భువనేశ్వర్ (ఒడిశా): ఓ యువతి పువ్వు కోసిందని 40 దళిత కుటుంబాలను పక్షం రోజుల పాటు సామాజిక బహిష్కరణ విధించిన దారుణ ఘటన ఒడిశాలోని ధెంకనల్ జిల్లాలో వెలుగుచూసింది. ధెంకనల్ జిల్లా కంటియో కాటేనీ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక ఉన్నత కులానికి చెందిన వ్యక్తుల తోటలో నుంచి పువ్వులు కోసింది. దళిత యువతి తోటలో పూలు కోసిందని 40 దళిత కుటుంబాలపై పక్షం రోజుల పాటు సామాజిక బహిష్కరణ విధించారు. 

సామాజిక బహిష్కరణ విధించిన 40 కుటుంబాలకు రేషన్ సరకులు ఇవ్వరాదని గ్రామ పెద్దలు ఆదేశించారు. పూలు కోసినందుకు బాలికతోపాటు ఆమె కుటుంబసభ్యులు క్షమాపణలు కోరినా పంచాయతీ పెద్దలు వినలేదు. పోలీసులతో పాటుగా ప్రభుత్వం జోక్యం చేసుకున్న తర్వాత సామాజిక బహిష్కరణ ముగిసింది. పాత శత్రుత్వం కారణంగా గ్రామంలో రెండు గ్రూపులు చాలాకాలంగా గొడవ పడుతున్నాయి. Advertisement
Advertisement
Advertisement