‘హైదరాబాద్’ ఫ్రాంచైజీలోనే ఏదో లోపం ఉంది: పాక్ మాజీ కెప్టెన్

ABN , First Publish Date - 2022-04-06T01:21:22+05:30 IST

ఐపీఎల్‌లో ఇప్పటి వరకు రెండు మ్యాచుల్లోనూ ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బోణీ కొట్టేందుకు నానా

‘హైదరాబాద్’ ఫ్రాంచైజీలోనే ఏదో లోపం ఉంది: పాక్ మాజీ కెప్టెన్

ముంబై: ఐపీఎల్‌లో ఇప్పటి వరకు రెండు మ్యాచుల్లోనూ ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బోణీ కొట్టేందుకు నానా పాట్లు పడుతోంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిన హైదరాబాద్.. సోమవారం (4న) లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కొద్దిలో విజయాన్ని చేజార్చుకుంది.  హైదరాబాద్ తాజా ఓటమి నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ స్పందించాడు. ఆ జట్టు ప్రదర్శన ఆకట్టుకోవడం లేదని పెదవి విరిచాడు. ఫ్రాంచైజీలోనే ఏదో లోపం ఉన్నట్టు కనిపిస్తోందని అన్నాడు.


హైదరాబాద్ జట్టు టైం మారడం లేదని, అది మంచి పిచ్ అయినా, చెత్త పిచ్ అయినా వారి తలరాతలో మార్పు ఉండడం లేదని బట్ చెప్పుకొచ్చాడు. కాబట్టి ఫ్రాంచైజీలోనే ఏదో లోపం ఉన్నట్టు అనిపిస్తోందన్నాడు. బట్ తన యూట్యూబ్‌ చానల్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు.


అలాగే, జట్టులో ఏడెన్ మార్క్‌రమ్ పాత్రపైనా బట్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మార్కరమ్ ప్రభావం చూపగల టాపార్డర్ బ్యాటర్ అని, కానీ అతడిని నాలుగు లేదంటే ఐదో స్థానంలో ఆడిస్తున్నారని అన్నాడు. అతడిని అదే స్థానంలో ఆడిస్తే ఎక్కువ పరుగులు చేయలేడని బట్ తేల్చి చెప్పాడు. 


Updated Date - 2022-04-06T01:21:22+05:30 IST