‘ఈఎస్‌ఐ’లో దోషులను శిక్షించాలి

ABN , First Publish Date - 2020-02-24T09:22:56+05:30 IST

కార్మికులకు సంబంధించిన మందులు, బయోమెట్రిక్‌ సాఫ్ట్‌వేర్‌ కొనుగోలు కుంభకోణంలో దోషులను శిక్షించాలని మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల మాణిక్యాలరావు డిమాండ్‌ చేశారు.

‘ఈఎస్‌ఐ’లో దోషులను శిక్షించాలి

  • బీజేపీ నేత మాణిక్యాలరావు

తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): కార్మికులకు సంబంధించిన మందులు, బయోమెట్రిక్‌ సాఫ్ట్‌వేర్‌ కొనుగోలు కుంభకోణంలో దోషులను శిక్షించాలని మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల మాణిక్యాలరావు డిమాండ్‌ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ చెప్పగా ఈఎ్‌సఐ మందుల కొనుగోలు చేసినట్లు నాటి కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కార్మికులకు ఇబ్బందులు లేకుండా మందులు కొనుగోలు చేసి  నిల్వ చేసుకోవాలని ప్రధాని సూచిస్తే... టెండర్లు పిలవకుండా కోట్ల రూపాయలు విలువచేసే మందులను కొనుగోలు చేసేందుకు మంత్రిగా అచ్చెన్న తన హయాంలో ఓ వ్యక్తిని సిఫారసు చేస్తూ అధికారులకు లేఖ రాశారని తెలిపారు. దీనిలో కోట్ల రూపాయలు అవినీతి చోటుచేసుకుందని, విచారణ జరిపి దోషులను శిక్షించాలని మాణిక్యాలరావు డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-02-24T09:22:56+05:30 IST