చంద్రబాబు తీసుకువచ్చిన చట్టమే రైతులను కాపాడుతోంది: Devineni Uma

ABN , First Publish Date - 2022-02-24T18:32:16+05:30 IST

రైతులకు భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా చంద్రబాబు సీఆర్డీఏ చట్టం తెచ్చారని... ఆ చట్టమే ఇప్పుడు రాజధాని రైతులను కాపాడుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు.

చంద్రబాబు తీసుకువచ్చిన చట్టమే రైతులను కాపాడుతోంది: Devineni Uma

అమరావతి: రైతులకు భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా చంద్రబాబు సీఆర్డీఏ చట్టం తెచ్చారని... ఆ చట్టమే ఇప్పుడు రాజధాని రైతులను కాపాడుతోందని  మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. వెలగపూడిలో రైతులు చేపట్టిన సామూహిక నిరాహార దీక్షకు దేవినేని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన విధ్వంసం అమరావతి విధ్వంసం వరకూ కొనసాగుతోందని. రైతులు అమరావతి కోసం ఆనందంగా భూములు ఇచ్చారని అన్నారు. అమరావతి గ్రాఫిక్స్ అంటున్న మంత్రులు ఇక్కడి భవనాల పైకి ఎక్కి దూకాలని... అప్పుడు రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. కృష్ణానది వరదలతో అమరావతిని ముంచాలని చూసిన దుర్మార్గులు వీరన్నారు. ప్రకాశం బ్యారేజీ ఎగువన వైకుంఠపురం వద్ద బ్యారేజికి మేం పనులు ప్రారంభిస్తే జగన్ వాటిని ఆపేశారని మండిపడ్డారు. రైతుల భూముల్లో నిర్మించిన సచివాలయంలో కూర్చుని అమరావతికి వ్యతిరేకంగా జీవోలు ఇస్తున్నారన్నారు. నేలపాడులోని హైకోర్టు మాత్రమే ఇప్పుడు రైతులను కాపుడుతోందని తెలిపారు. న్యాయస్థానం లేకపోతే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి ఎవరినీ ఉండనిచ్చేవారు కాదన్నారు. తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని... ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేస్తామని దేవినేని ఉమా స్పష్టం చేశారు. 

Updated Date - 2022-02-24T18:32:16+05:30 IST