MLC ఉదయ్ భాస్కర్‌పై బండారు సత్యనారాయణ విమర్శలు
ABN , First Publish Date - 2022-05-23T18:57:56+05:30 IST
ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్‌పై బండారు సత్యనారాయణ మూర్తి విమర్శలు గుప్పించారు.
అమరావతి: ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్‌పై మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి విమర్శలు గుప్పించారు. దొంగ వ్యాపారాలు చేసే క్రిమినల్ ఉదయ్ భాస్కర్ అని ఆరోపించారు. ఎమ్మెల్యే ద్వారంపూడితో కలిసి ఎమ్మెల్సీ అక్రమాలు చేశారన్నారు. ఎమ్మెల్సీ కారు డ్రైవర్ హత్యపై హోంమంత్రి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్‌ను పోలీసులే దాచారని అన్నారు. డ్రైవర్ హత్య విషయంపై సజ్జల ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. కారు డ్రైవర్ హత్య వ్యవహారం సజ్జల డైరెక్షన్లోనే జరిగిందని బండారు సత్యనారాయణ ఆరోపించారు.