న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కరోనా బారినపడ్డాడు. తనకు వైరస్ సోకిన విషయాన్ని భజ్జీ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. తాను ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నానని, అవసరమైన అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నట్టు చెప్పాడు. తనలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయన్న హర్భజన్.. ఇటీవల తనను కలిసిన వారు వీలైనంత త్వరగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరాడు.
క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు గతేడాది డిసెంబరులో హర్భజన్ సింగ్ ప్రకటించాడు. 41 ఏళ్ల భజ్జీ.. భారత్ తరపున 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20లు ఆడాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో 294 వికెట్లు తీసుకున్నాడు. 103 టెస్టుల్లో 417 వికెట్లు తీసుకున్నాడు. టెస్టుల్లో హ్యాట్రిక్ తీసుకున్న తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. మొత్తంగా 367 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన హర్భజన్ 711 వికెట్లు పడగొట్టాడు. 3,569 పరుగులు సాధించాడు.
ఇవి కూడా చదవండి