Ausaf Sayeed: ఏడు నెలల్లో 3.43 లక్షల పాస్‌పోర్టులు.. చిప్‌ పాస్‌పోర్టు పౌరుల ఐచ్ఛికమే

ABN , First Publish Date - 2022-08-25T13:30:55+05:30 IST

నకిలీ పాస్‌పోర్టులకు కళ్లెం వేయడంతోపాటు.. విమానాశ్రయాల్లో మరింత వేగవంతంగా సేవలందించేందుకు ఈ-పాస్‌పోర్టులు దోహదపడతాయని, దేశంలో మరో ఐదు నెలల్లో ఈ వ్యవస్థను ప్రవేశపెడతామని విదేశీ వ్యవహరాల కార్యదర్శి డాక్టర్‌ ఔసాఫ్‌ సయీద్‌ వెల్లడించారు.

Ausaf Sayeed: ఏడు నెలల్లో 3.43 లక్షల పాస్‌పోర్టులు.. చిప్‌ పాస్‌పోర్టు పౌరుల ఐచ్ఛికమే

5 నెలల్లో ఈ-పాస్‌పోర్టులు

విదేశీ ఉద్యోగాలకు నైపుణ్య శిక్షణ

విదేశీ వ్యవహారాల కార్యదర్శి సయీద్‌

హైదరాబాద్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): నకిలీ పాస్‌పోర్టులకు కళ్లెం వేయడంతోపాటు.. విమానాశ్రయాల్లో మరింత వేగవంతంగా సేవలందించేందుకు ఈ-పాస్‌పోర్టులు దోహదపడతాయని, దేశంలో మరో ఐదు నెలల్లో ఈ వ్యవస్థను ప్రవేశపెడతామని విదేశీ వ్యవహరాల కార్యదర్శి డాక్టర్‌ ఔసాఫ్‌ సయీద్‌ వెల్లడించారు. ఈ-పాస్‌పోర్టు వ్యవస్థలో.. ఇప్పుడున్న పాస్‌పోర్టులోనే చిప్‌ను అమరుస్తామని వివరించారు. ఆ చిప్‌లో పాస్‌పోర్టుదారుడి వివరాలన్నీ నిక్షిప్తమై ఉంటాయని పేర్కొన్నారు. బుధవారం సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన అంశాలపై మాట్లాడారు. ఈ-పా్‌సపోర్టు అనేది పౌరుల ఐచ్ఛికం మాత్రమేనని, తప్పనిసరి కాదని సయీద్‌ స్పష్టం చేశారు. విదేశాల్లో ఉపాధి అవకాశాలు పెంచేలా ‘విదేశీ సంపర్క్‌’ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న విషయాన్ని వివరిస్తూ.. తెలంగాణలో మూడేళ్ల క్రితం ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు. ఇందుకోసం సౌదీ అరేబియా, దుబాయ్‌, ఇటలీ, జర్మనీ, మారిషస్‌, మలేసియాతో పాటు 12 దేశాలతో భారత ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుందని వివరించారు. మరో 59 దేశాలతో ఒప్పందాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.  


ఏడు నెలల్లో 3.43 లక్షల పాస్‌పోర్టులు

తెలంగాణలో ఈ ఏడాది జనవరి-జూలై మధ్యకాలంలో 3.43 లక్షల పాస్‌పోర్టులు జారీచేశామని సయీద్‌ వివరించారు. భారత పాస్‌పోర్టు కలిగిన 3.20 కోట్ల మంది విదేశాల్లో ఉంటున్నారన్నారు. విదేశీ వర్సిటీలు భారత విద్యార్థుల ప్రవేశాలకు అనుమతించడం లేదన్న ప్రశ్నకు స్పందిస్తూ.. అది వర్సిటీల నిర్ణయమని, విద్యార్థుల అర్హతల మేరకు ప్రవేశాలుంటాయన్నారు. సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి, భారత ప్రధాన పాస్‌పోర్ట్‌ అధికారి టి.ఆర్మ్‌స్ట్రాంగ్‌ చాంగ్సన్‌, సంయుక్త కార్యదర్శి బ్రమ్హ కుమార్‌, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారులు శ్రీనివాస రావు, విశ్వాంజలి గైక్వాడ్‌ పాల్గొన్నారు.


ఐదు రోజుల్లో పోలీసు వెరిఫికేషన్‌

సయీద్‌ బుధవారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డితో సమావేశమయ్యారు. పోలీసు వెరిఫికేషన్‌లో ఆలస్యంతో పాస్‌పోర్టుల జారీలో జాప్యం జరుగుతోందని, దీనిని వేగవంతం చేయా లన్న విజ్ఞప్తిపై డీజీపీ సానుకూలంగా స్పందించారని.. 5 రోజుల్లోపు నివేదిక 

Updated Date - 2022-08-25T13:30:55+05:30 IST