Abn logo
Dec 13 2020 @ 00:52AM

నిగారింపు కోసం..!

మూడు టేబుల్‌స్పూన్ల ఓట్‌మీల్‌, ఎగ్‌ వైట్‌, ఒక టీస్పూను తేనె, ఒక టీస్పూను పెరుగు తీసుకుని మిశ్రమంలా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్లబడిన తరువాత ముఖానికి ప్యాక్‌ మాదిరిగా అప్లై చేసుకోవాలి. ఇరవై నిమిషాల తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.