రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు

ABN , First Publish Date - 2021-04-23T06:30:16+05:30 IST

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు

ఎన్‌హెచ్‌ఏఐ డీఈఈ కృష్ణారెడ్డి


చిలుపూర్‌, ఏప్రిల్‌ 22 : జాతీయ రహదారిపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టనున్నట్లు నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) డీఈఈ కృష్ణారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చిన్నపెండ్యాల, నష్కల్‌, వంగాలపల్లి- కరుణాపురం చౌరస్తా వద్ద ఉన్న మలుపులను ఎస్సై మాసిరెడ్డి మహేందర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. మూల మలుపులు, డివైడర్ల వద్ద ఎదురవుతున్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వంగా లపల్లి - కరుణాపురం గ్రామాలకు వెళ్ళే మార్గంలో 2 కిలోమీటర్ల దూరంలో రోడ్డు క్రాస్‌ చేయడం ఇబ్బందికరంగా ఉందని, చిన్నపెండ్యాల బస్టాండ్‌ చౌరస్తా వద్ద ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. హైవేపై సైన్‌బోర్డుల ఏర్పాటుతో పాటు, మూలమలుపుల వద్ద లైటింగ్‌ను ఏర్పాటు చేస్తామని డీఈఈ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మామిడాల లింగారెడ్డి, ఆరూరి ప్రణీత, కర్ణకంటి స్వప్న, జనగాం యాదగిరి, వెంకటేష్‌, ప్రదీప్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-23T06:30:16+05:30 IST