ఫుట్‌బాలర్‌ ఫార్మసిస్ట్‌ అవతారం

ABN , First Publish Date - 2020-03-29T09:57:44+05:30 IST

స్పెయిన్‌ ఫుట్‌బాలర్‌ టోని డొవాలె ఆటకు తాత్కాలికంగా విరామం ప్రకటించాడు. దేశంలో కరోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తుండడంతో.. ఫార్మసీ చదివిన 29 ...

ఫుట్‌బాలర్‌ ఫార్మసిస్ట్‌ అవతారం

కొరునా (స్పెయిన్‌): స్పెయిన్‌ ఫుట్‌బాలర్‌ టోని డొవాలె ఆటకు తాత్కాలికంగా విరామం ప్రకటించాడు. దేశంలో కరోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తుండడంతో.. ఫార్మసీ చదివిన 29 ఏళ్ల ఈ మిడ్‌ఫీల్డర్‌ ఫార్మసి్‌స్టగా సేవలు అందించాలని నిర్ణయించుకున్నాడు. ఫార్మసీ పూర్తి చేసినా ఫుట్‌బాల్‌పై ఆసక్తితో అతడు ఇప్పటివరకు ఫార్మసీలో పని చేయలేదు. కానీ ప్రస్తుతం స్పెయిన్‌పై కొవిడ్‌-19 పంజా విసరడంతో స్థానికంగా తన కుటుంబం నడుపుతున్న ఫార్మసీలో టోని సేవలు అందిస్తున్నాడు. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ మాజీ చాంపియన్‌ బెంగళూరు ఎఫ్‌సీతోపాటు ఐ లీగ్‌లో ఈస్ట్‌బెంగాల్‌ తరపున టోని ఆడడం గమనార్హం. 


Updated Date - 2020-03-29T09:57:44+05:30 IST