Abn logo
Sep 13 2021 @ 10:41AM

అభిమానులు విసిరిన బీరు గ్లాసును అలవోకగా పట్టుకున్న ఫుట్‌బాల్ క్రీడాకారుడు!

లండన్: ఇది ఒక అసాధారణమైన దృశ్యం. 18 ఏళ్ల ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ మిడ్‌ఫీల్డర్ జూడ్ బెల్లింగ్‌హామ్ తన మొదటి బీరును అందుకున్నాడు. శనివారం బేయర్ లీవర్‌కుసెన్‌లో బుండేస్ లీగ్ ఆటలో బోరుసియా డార్ట్ముండ్ తరపున  ఆడుతున్నప్పుడు, బెల్లింగ్‌హామ్... నార్వేజియన్ టీమ్ ఆటగాడు ఎర్లింగ్ బ్రాట్ హాలాండ్ వెనుకకు దూసుకెళ్లాడు, తరువాత పెనాల్టీ స్పాట్ నుండి ఏడో గోల్‌లో విజయం సాధించాడు. డార్ట్‌మండ్ ఆటగాళ్లు శత్రువుల గడ్డపై అభిమానుల మధ్య సంబరాలు చేసుకుంటుండగా, బీర్‌తో నిండిన... తిరిగివాడలేని బీరు గ్లాసులను తమవైపు విసిరివేయడాన్ని వారు గమనించారు. 

ఇంతలోనే క్రికెట్ మ్యాచ్‌లో నైపుణ్యం కలిగిన ఫీల్డర్ మాదిరిగా బెల్లింగ్‌హామ్ ఎంతో నైపుణ్యంతో ఎడమ చేతితో అలవోకగా ఆ గ్లాస్ అందుకుని సిప్ చేశాడు. అయితే ఆ బీరు నచ్చక గ్లాస్ విసిరివేస్తూ, చిరునవ్వులు చిందించాడు. ఈ ఘటన అనంతరం బెల్లింగ్‌హామ్ ఒక వీడియోను షేర్ చేస్తూ, ‘చీయర్స్’ అనే కామెంట్ రాశారు. మరో ట్వీట్‌లో బెల్లింగ్‌హామ్... ఇది నా తొలి బీరుకు తగిన రోజు అని రాశాడు.