రక్షించేది అదే!

ABN , First Publish Date - 2020-10-23T05:30:00+05:30 IST

ఫలితం మీద కాకుండా పని మీద దృష్టి పెట్టాలి. అలా ఉండగలిగితే దేవుడు రక్షిస్తాడు. ఈ విషయం గురించి భర్తృహరి సుభాషితాలను తెలుగులో అందించిన ఏనుగు లక్ష్మణ కవి పద్యం ద్వారా తెలుసుకుందాం...

రక్షించేది అదే!

ఫలితం మీద కాకుండా పని మీద దృష్టి పెట్టాలి. అలా ఉండగలిగితే దేవుడు రక్షిస్తాడు. ఈ విషయం గురించి భర్తృహరి సుభాషితాలను తెలుగులో అందించిన ఏనుగు లక్ష్మణ కవి పద్యం ద్వారా తెలుసుకుందాం. 


కాననమున రణమున, సలి/ లానల రిపు మధ్యమున మహాబ్ధి నగాగ్ర/ స్థానమున సత్తునిద్రితు / పూనికతో పూర్వపుణ్యములు రక్షించున్‌


అడవిలో ఉన్నా, యుద్ధ భూమిలో ఉన్నా, శత్రువుల మధ్య ఉన్నా,  నీటిలో మునిగిపోతున్నా, దావానలంలో లేదా గుహలో చిక్కుకున్నా, కొండ కొమ్ముపై నుంచి దిగలేకున్నా, మహా సముద్రంలో ఉన్నా, నిద్రమత్తులో ఉన్నా... ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా పూర్వజన్మలో చేసిన పుణ్యాలు కాపాడతాయి. దీనికి చక్కటి ఉదాహరణ పరీక్షిత్తు కథ. అశ్వత్థామ భయంకరమైన అస్త్రాన్ని సంధించాడు. అది గర్భంతో ఉన్న ఉత్తర వైపు దూసుకొచ్చింది. దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. కానీ పరీక్షిత్తు పూర్వ జన్మ పుణ్యాలే కాపాడాయి. గర్భంలో ఉన్న శిశువు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. పరీక్షిత్తు బతికి బయటపడ్డాడు. తల్లి కడుపులోని శిశువు ప్రార్థన చేసిన సందర్భం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. 

- గరికిపాటి నరసింహారావు

Updated Date - 2020-10-23T05:30:00+05:30 IST