‘ఫ్లయింగ్‌ ఫిష్‌’ వరల్డ్‌ రికార్డు

ABN , First Publish Date - 2021-08-31T09:36:26+05:30 IST

ఎనిమిదేళ్ల ప్రాయంలో స్విమ్మింగ్‌లో అడుగుపెట్టిన ఆ అమ్మాయి మరో ఐదేళ్లకు పారా స్విమ్మింగ్‌లో ప్రపంచ..

‘ఫ్లయింగ్‌ ఫిష్‌’ వరల్డ్‌ రికార్డు

టోక్యో: ఎనిమిదేళ్ల ప్రాయంలో స్విమ్మింగ్‌లో అడుగుపెట్టిన ఆ అమ్మాయి మరో ఐదేళ్లకు పారా స్విమ్మింగ్‌లో ప్రపంచ రికార్డులతో సంచలనాల మోత మోగించే స్థాయికి ఎదిగింది. ఆమే  ‘ఫ్లయింగ్‌ ఫిష్‌’గా మన్ననలు అందుకుంటున్న 16 ఏళ్ల జియాంగ్‌ యుయాన్‌. సోమవారం మహిళల 50 మీ. బటర్‌ఫ్లయ్‌ ఎ్‌ఫ్‌-6 విభాగం ఈవెంట్‌ను 34.56 సెకన్ల వరల్డ్‌ రికార్డు టైమింగ్‌తో పూర్తి చేసి స్వర్ణం నెగ్గింది. మూడేళ్ల వయస్సులో రోడ్డుపై ఆడుకుంటుండగా వ్యాన్‌ దూసుకు పోవడంతో జియాంగ్‌ కుడి చేయి, కుడికాలు కోల్పోయింది. ఆపై తల్లి సలహాతో స్విమ్మింగ్‌లోకి ప్రవేశించి అనతి కాలంలోనే కొలనులో సంచలనాలను సృష్టిస్తోంది జియాంగ్‌ యుయాన్‌.

Updated Date - 2021-08-31T09:36:26+05:30 IST