కరోనాకు కేంద్రంగా మారుతున్న ఫ్లోరిడా.. ఒక్కరోజే..

ABN , First Publish Date - 2020-06-28T05:02:03+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే.

కరోనాకు కేంద్రంగా మారుతున్న ఫ్లోరిడా.. ఒక్కరోజే..

ఆర్లాండో: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. మార్చి, ఏప్రిల్ నెలల్లో అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాలు కరోనాకు కేందంగా మారాయి. అయితే ఆయా రాష్ట్రాలు సమర్థవంతంగా కరోనాను ఎదుర్కోవడంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇదే సమయంలో అమెరికాలోని మిగతా రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి పెరగడం మొదలైంది. ముఖ్యంగా టెక్సాస్, కాలిఫోర్నియా, ఫ్లోరిడా రాష్ట్రాలు కరోనాకు కేంద్రంగా మారుతున్నాయి. ఫ్లోరిడాలో గడిచిన 24 గంటల్లో 9,585 కేసులు నమోదైనట్టు ఫ్లోరిడా ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. కరోనా మహమ్మారి మొదలైన నాటి నుంచి ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి అని ఆరోగ్యశాఖ తెలిపింది. శుక్రవారం ఫ్లోరిడాలో 8,942 కేసులు నమోదుకాగా.. శనివారం అంతకుమించిన కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో ఫ్లోరిడాలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1,32,545కి చేరింది. లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎత్తివేయడంతో కేసులు ఈ రకంగా పెరుగుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. అమెరికాలోని 29 రాష్ట్రాల్లో గత వారంతో పోల్చుకుంటే ఈ వారం కేసులు దాదాపు రెండు రెట్లు పెరిగాయి. కాగా.. అమెరికా వ్యాప్తంగా ఇప్పటివరకు 25,77,368 కరోనా కేసులు నమోదుకాగా.. కరోనా కారణంగా 1,27,948 మంది మృత్యువాతపడ్డారు.

Updated Date - 2020-06-28T05:02:03+05:30 IST