Abn logo
Oct 22 2020 @ 00:22AM

హెడ్‌ బ్యాండ్‌తో స్టయిల్‌గా...

పండుగ వేళ, బంధుమిత్రులను కలిసే సమయంలో అందరికన్నా ఫ్యాషన్‌గా కనిపించాలనుకుంటాం. అలాగనీ మేకప్‌ ఎలా ఉండాలి! అని తెగ ఆలోచించాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా ఉండే హెడ్‌ బ్యాండ్‌తో నలుగురిలో ప్రత్యేకంగా కనిపించవచ్చు అంటున్నారు ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రియా కటారియా పూరి... అదెలాగో చూద్దాం...


ఆకర్షణీయమైన హెడ్‌ బ్యాండ్‌ ఉంటే చాలు మేకప్‌ వేసుకోకున్నా సరే అందం ఏమాత్రం తగ్గదు. ఫ్యాషన్‌కు చిరునామాగా మారిన హెడ్‌ బ్యాండ్స్‌లో వెరైటీలు చాలా ఉన్నాయి. ఆభరణాలు పొదిగిన హెడ్‌ బ్యాండ్‌ ధరిస్తే రిచ్‌ లుక్‌ సొంతమవుతుంది. అంతేకాదు అందరి కళ్లు మీ మీదే ఉంటాయి. వీటితో పాటు ఆధునికంగా కనిపించే టర్బన్‌ హెడ్‌బ్యాండ్స్‌ త్రీడీ ఆకర్షణ, సిగ్నేచర్‌ ప్రింట్స్‌, లోహపు పోగులు, చిన్న ఊలు బంతులు, పూలు, జంతువుల బొమ్మలు... ఇలా పలు ఆకర్షణీయమైన రూపాల్లో హెడ్‌ బ్యాండ్స్‌ మార్కెట్‌లో లభిస్తున్నాయి. పండుగల వేళ తల్లీకూతుళ్లు ఒకేలా కనిపించేలా ‘మమ్మీ అండ్‌ మీ’ హెడ్‌బ్యాండ్స్‌ కూడా దొరకుతున్నాయి.