floods: భద్రాచలం దగ్గర తగ్గుముఖం పట్టిన గోదావరి

ABN , First Publish Date - 2022-08-20T01:35:25+05:30 IST

భద్రాచలం (Bhadrachalam) దగ్గర గోదావరి ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. గోదావరికి 11,39,230 క్యూసెక్కుల నీరు వస్తోందని అధికారులు చెబుతున్నారు.

floods: భద్రాచలం దగ్గర తగ్గుముఖం పట్టిన గోదావరి

భద్రాచలం: భద్రాచలం (Bhadrachalam) దగ్గర గోదావరి ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. గోదావరికి 11,39,230 క్యూసెక్కుల నీరు వస్తోందని అధికారులు చెబుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి ప్రస్తుత నీటిమట్టం 47.90 అడుగులు ఉంది. గోదావరి దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరోవైపు తూర్పుగోదావరిజిల్లా ధవళేశ్వరం (Dhavaleswaram) వద్ద గతవారం రోజులుగా పెరుగుతున్న గోదావరి (Godavari) తగ్గుముఖం పడుతోంది. గురువారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు 15.80 అడుగుల వద్ద నిలకడగా కొనసాగిన నీటిమట్టం ఆపై తగ్గుముఖం పట్టింది. 4గంటల వ్యవధిలో ఒక్క పాయింట్‌ చొప్పున తగ్గిన నీటిమట్టం శుక్రవారం ఉదయం 7గంటలకు 15.60 అడుగులకు చేరుకోగా సాయంత్రానికి క్రమంగా తగ్గుతూ 15.10అడుగులకు చేరుకుంది. ఈ సమయంలో బ్యారేజీ నుంచి 14,94,850 క్యూసెక్కులు సముద్రంలోకి ప్రవహిస్తోంది. శనివారం సాయంత్రానికి రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించే స్థాయికి నీటిమట్టం తగ్గుముఖం పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

Updated Date - 2022-08-20T01:35:25+05:30 IST