ఐదు రోజుల ర్యాలీకి అడ్డుకట్ట

ABN , First Publish Date - 2022-01-15T08:38:06+05:30 IST

స్టాక్‌ మార్కెట్లో ఐదు రోజుల వరుస ర్యాలీకి బ్రేక్‌ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల కారణంగా ప్రామాణిక..

ఐదు రోజుల ర్యాలీకి అడ్డుకట్ట

స్వల్ప నష్టాల్లో ముగిసిన సూచీలు 


ముంబై: స్టాక్‌ మార్కెట్లో ఐదు రోజుల వరుస ర్యాలీకి బ్రేక్‌ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల కారణంగా ప్రామాణిక ఈక్విటీ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. శుక్రవారం బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 12.27 పాయింట్లు కోల్పోయి 61,223.03 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 2.05 పాయింట్ల నష్టంతో 18,255.75 వద్ద క్లోజైంది. సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీల్లో 18 నష్టాల్లోనే ముగిశాయి. ఏషియన్‌ పెయింట్స్‌ 2.66 శాతం క్షీణించి సూచీ టాప్‌ లూజర్‌గా నిలిచింది. ఈ వారం మొత్తానికి సెన్సెక్స్‌ 1,478.38 పాయింట్లు (2.47 శాతం), నిఫ్టీ 443.05 పాయింట్లు (2.48 శాతం) బలపడ్డాయి. 

Updated Date - 2022-01-15T08:38:06+05:30 IST