ఫస్ట్‌ ఇంటర్‌ తరగతులు 18 నుంచి

ABN , First Publish Date - 2021-01-09T08:42:44+05:30 IST

ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం తరగతులను ఈ నెల 18 నుంచి ప్రారంభించనున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వెల్లడించారు.

ఫస్ట్‌ ఇంటర్‌ తరగతులు 18 నుంచి

  • ఆరో తరగతి క్లాసులు కూడా ప్రారంభం
  • త్వరలో పరీక్షల షెడ్యూల్‌ విడుదల 
  • 11న అమ్మఒడి రెండో విడత జమ: మంత్రి 
  • ఆఫ్‌లైన్‌లో ఇంటర్మీడియెట్‌ అడ్మిషన్లు


అమరావతి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం తరగతులను ఈ నెల 18 నుంచి ప్రారంభించనున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వెల్లడించారు.  ఆరో తరగతి విద్యార్థులకు కూడా అదే రోజు నుంచి పాఠశాలలు ప్రారంభమవుతాయని చెప్పారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ఏడాది ఆఫ్‌లైన్‌లోనే ఇంటర్‌ తొలి సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలో ఇంటర్మీడియట్‌ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్‌ తొలి ఏడాది అడ్మిషన్ల షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేశామని మంత్రి తెలిపారు. ఈ నెల 17 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని, అదే రోజు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. ఆ మరుసటి రోజు తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. 


త్వరలో ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌

2020-21 విద్యాసంవత్సరం ఈ ఏడాది మే వరకు కొనసాగుతుందని మంత్రి సురేశ్‌ వెల్లడించారు. సీబీఎ్‌సఈ షెడ్యూల్‌ ప్రకారం పోటీ పరీక్షలకు ఇబ్బందులు కలగకుండా ఉండేలా ఇంటర్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్‌, మే నెలల్లో పరీక్షలు నిర్వహించే అవకాశముందని, షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. గతేడాది వసూలు చేసిన ఫీజులో 30ు రాయితీ ఇచ్చి, 70ు ఫీజు వసూలు చేసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేసినా, కరోనా గైడ్‌లైన్స్‌ పాటించకున్నా కళాశాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు. అధిక ఫీజులు వసూలు చేసే కళాశాలల అక్రమాలను తమ దృష్టికి తీసుకురావాలన్నారు. 9391282578 వాట్సాప్‌ నెంబర్‌కుగానీ, ౌఠటఛజ్ఛ్చీఞఃజఝ్చజీజూ.ఛిౌఝ మెయిల్‌కు గానీ సమాచారం ఇస్తే సంబంధిత కళాశాలలపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్టు చెప్పారు. అడ్మిషన్ల సమయంలో టెన్త్‌క్లా్‌స, ఇతర సర్టిఫికెట్లను పరిశీలించి తిరిగి విద్యార్థులకు ఇచ్చివేయాలని, సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వని కళాశాలలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.


పారదర్శకంగా ‘అమ్మఒడి’ 

ఈ నెల 11న ‘జగనన్న అమ్మఒడి’ రెండో విడత చెల్లింపులు చేపట్టనున్నట్లు మంత్రి సురేశ్‌ తెలిపారు. నెల్లూరులో సీఎం జగన్‌ చేతులమీదుగా ఆన్‌లైన్‌ ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమ చేయనున్నట్టు చెప్పారు. అర్హుల జాబితాను పారదర్శకంగా రూపొందించామని, పాఠశాలలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించామని తెలిపారు. 

Updated Date - 2021-01-09T08:42:44+05:30 IST