బెంగళూరు నుంచి కర్నూలుకు తొలి విమానం
ABN , First Publish Date - 2021-03-27T22:00:17+05:30 IST
ఓర్వకల్లు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్టులో ఆదివారం నుంచి విమాన సర్వీసులు ప్రారంభంకానున్నాయి
కర్నూలు: ఓర్వకల్లు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్టులో ఆదివారం నుంచి విమాన సర్వీసులు ప్రారంభంకానున్నాయి. రేపు ఉదయం 10.10 గంటలకు బెంగళూరు నుంచి కర్నూలుకు తొలి విమానం రానుంది. ఈ తర్వాత ఉదయం 10.30కి కర్నూలు నుంచి విశాఖకు తొలి విమాన సర్వీసు ప్రారంభమవుతుంది. ఓర్వకల్లు విమానాశ్రయాన్ని సీఎం జగన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఓర్వకల్లు విమానాశ్రయానికి మొదటి స్వాతంత్య్ర సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెడుతున్నామని సీఎం ప్రకటించారు.