South Africa vs India: తొలి రోజు భారత్‌దే!

ABN , First Publish Date - 2021-12-27T02:47:11+05:30 IST

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి

South Africa vs India: తొలి రోజు భారత్‌దే!

సెంచూరియన్: సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌‌కు శుభారంభమే లభించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ జాగ్రత్తగా ఆడుతూ తొలి వికెట్‌కు 117 పరుగులు జోడించారు. తొలి సెషన్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన సఫారీ బౌలర్లు రెండో సెషన్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ను కొంత ఇబ్బంది పెట్టారు. 


లంచ్ తర్వాత మయాంక్ అగర్వాల్ (60), పుజారా(0)ను వరుస బంతుల్లో పెవిలియన్ పంపిన లుంగి ఎంగిడి.. క్రీజులో కుదురుకుంటున్న కెప్టెన్ కోహ్లీ (35)ని కూడా పెవిలియన్ పంపాడు. దీంతో భారత జట్టు కష్టాల్లో పడినట్టు కనిపించింది. అయితే, క్రీజులోకి వచ్చిన రహానేతో కలిసి రాహుల్ జాగ్రత్తగా ఆడుతూ టెస్టుల్లో ఏడో శతకం పూర్తి చేసుకున్నాడు. దీంతో మూడో సెషన్‌లోనూ భారత్‌దే పైచేయి అయింది. ఆట ముగిసే సమయానికి రాహుల్ 122, రహానే 40  పరుగులతో క్రీజులో ఉన్నారు. 

Updated Date - 2021-12-27T02:47:11+05:30 IST