Abn logo
Aug 19 2021 @ 11:44AM

Paralympic Village: మొదటి కరోనా కేసు నమోదు

టోక్యో : జపాన్ దేశంలోని టోక్యో నగర పరిధిలోని పారా ఒలింపిక్ గ్రామంలో గురువారం మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు వెలుగుచూసింది. పారాఒలింపిక్స్ పోటీలు ప్రారంభానికి ముందు పారా ఒలింపిక్ క్రీడా గ్రామంలో ఒక కరోనా కేసు వెలుగుచూడటం కలకలం రేపింది. పారాఒలింపిక్ పోటీలకు ముందు జపాన్ దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి. జపాన్ దేశంలో నివశిస్తున్న కాంట్రాక్టర్లు, ఆటల సిబ్బందిలో 74 మందికి కరోనా కేసులు వెలుగుచూశాయి. క్రీడాకారుల శిక్షణ శిబిరాల్లో మరో 6 కరోనా కేసులు వెలుగుచూశాయి. కాని పారా ఒలింపిక్ క్రీడా గ్రామంలో మొట్టమొదటి సారి కరోనా పాజిటివ్ కేసు బయటపడింది. 

క్రైమ్ మరిన్ని...