Advertisement
Advertisement
Abn logo
Advertisement

13 అంతస్తుల భవనం దగ్ధం.. తైవాన్‌లో46 మంది మృతి

తైపే, అక్టోబరు 14: ఓ పెద్ద భవనంలో అందరూ గాఢనిద్రలో ఉన్నప్పుడు అగ్ని ప్రమాదం సంభవించింది. ఏం జరుగుతోందో తెలిసేలోపే అగ్నికీలలు చుట్టుముట్టాయి. దీంతో చాలామంది నిద్రలోనే మృత్యువాతపడ్డారు. తైవాన్‌లోని కావోష్యాంగ్‌ నగరంలో 13 అంతస్తుల భవనంలో గురువారం తెల్లవారుజామున 3 గంటలకు మంటలు చెలరేగాయి. కింది అంతస్తుల్లో షాపింగ్‌ మాల్స్‌, పై అంతస్తుల్లో నివాసాలు ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొనేసరికే పలు అంతస్తులు మంటల్లో కాలిపోయాయి. దట్టమైనపొగ కమ్ముకోవడంతో సహాయ సిబ్బంది మధ్యాహ్నానానికిగానీ లోనికి వెళ్లలేకపోయారు. 46 మంది మృతి చెందారని.. ఈ సంఖ్య పెరగొచ్చని అధికారులు తెలిపారు. 50 మందికిపైగా గాయపడ్డారన్నారు. అగ్ని ప్రమాద కారణంపై ఇంకా స్పష్టత లేదన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement