Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆరేళ్లు దాటిన ప్రవాసుల పిల్లల విషయమై సౌదీ కీలక ప్రకటన !

రియాధ్: ఆరేళ్లకు పైబడిన ప్రవాసుల పిల్లల విషయమై సౌదీ అరేబియా తాజాగా కీలక ప్రకటన చేసింది. రెసిడెన్సీ పర్మిట్(ఇకామా), ప్రయాణ విధానాలను పూర్తి చేయడానికి కావాల్సిన బయోమెట్రిక్ వివరాల కోసం తప్పనిసరిగా వేలిముద్రలను (ఫింగర్‌ప్రింట్స్) నమోదు చేసుకోవాలని సౌదీ జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్(జవాజత్) వెల్లడించింది. కనుక ఆరు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారి పిల్లల వేలిముద్రలను సాధ్యమైనంత త్వరగా నమోదు చేయడానికి కింగ్డమ్‌లోని ప్రవాసులందరూ ముందుకు రావాలని జవాజత్ కోరింది. ప్రవాస కార్మికులు, వారి కుటుంబ సభ్యులు రెసిడెన్సీ, ప్రయాణ విధానాలను పూర్తి చేయడానికి వేలిముద్రలను నమోదు చేసుకోవడం తప్పనిసరి అని ఈ సందర్భంగా అధికారులు మరోసారి స్పష్టం చేశారు. 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement