సూర్యాపేట జిల్లా పెద్దనేమిలలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2020-05-27T04:35:17+05:30 IST

నూతనకల్‌ మండలం పెద్దనేమిలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో వేధిస్తున్న అబ్బాయికి యువతి బంధువులు వార్నింగ్ ఇచ్చారు. దీంతో..

సూర్యాపేట జిల్లా పెద్దనేమిలలో ఉద్రిక్తత

సూర్యాపేట: నూతనకల్‌ మండలం పెద్దనేమిలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో వేధిస్తున్న అబ్బాయికి యువతి బంధువులు వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆగ్రహానికి గురైన యువకుడు తన పోకిరీ బ్యాచ్‌తో యువతి బంధువులపై గొడ్డళ్లు, కర్రలతో దాడి చేశాడు. ఈ దాడిలో ఎనిమిది మందికి తీవ్రగాయాలు, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-05-27T04:35:17+05:30 IST