Advertisement
Advertisement
Abn logo
Advertisement

నందికొట్కూరు వైసీపీలో భగ్గుమన్న వర్గపోరు

కర్నూలు: జిల్లాలోని వైసీపీలో ఉన్న అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. నందికొట్కూరు నియోజకవర్గంలోని వైసీపీలో వర్గపోరు భగ్గుమంది. ఎమ్మెల్యే ఆర్థర్ వర్గీయులు, బైరెడ్డి సిద్దార్థ రెడ్డి వర్గీయులు పరస్పరం తీవ్రస్థాయిలో కొట్టుకున్నారు. దాడులు చేసుకున్నారు.


12వ వార్డులో సిద్దార్థ రెడ్డి బలపరిచిన అభ్యర్థి వైసీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. రెబల్ అభ్యర్థి తరపున వార్డు వలంటీర్ ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తున్నాడని ప్రచారం జరిగింది. దీంతో రెబల్ తరపున  ఓటరు స్లిప్పులు ఎలా పంపిణీ చేస్తున్నావని వార్డు వలంటీర్‌ను ఎమ్మెల్యే వర్గీయులు ప్రశ్నించడంతో గొడవ తలెత్తింది.

Advertisement
Advertisement