మీ భూముల కోసం పోరాడండి

ABN , First Publish Date - 2022-06-30T08:32:35+05:30 IST

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను లాక్కోవాలని ఎవురు ప్రయత్నించినా తిరగబడాలని అసైన్డ్‌ భూముల లబ్ధిదారులకు

మీ భూముల కోసం పోరాడండి

లాక్కోవాలని చూస్తే తిరగబడండి

అసైన్డ్‌ లబ్ధిదారులకు సీఎల్పీ నేత భట్టివిక్రమార్క పిలుపు 

హైదరాబాద్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను లాక్కోవాలని ఎవురు ప్రయత్నించినా తిరగబడాలని అసైన్డ్‌ భూముల లబ్ధిదారులకు సీఎఎల్పీ నేత భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. బాధితుల వెంట తానుంటానని భరోసా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా ఇలాంటి భూములను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తిరిగి తీసుకునే ప్రయత్నం చేస్తే క్షేత్రస్థాయులో ఉద్యమించి ఆ సమాచారాన్ని సీఎల్పీ కార్యాలయానికి లిఖితపూర్వకంగా పంపాలని సూచించారు. కాంగ్రెస్‌ బాధితుల పక్షాననిలబడి పోరాటం చేస్తుందని బుధవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని పేదలు, బడుగు, బలహీన వర్గాలకు గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములను అభివృద్ధి అవసరాల పేరిట ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటోందని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. కాగా, బీజేపీ జాతీయ మహాసభల్లో ఏర్పాటు చేస్తున్న ఎగ్జిబిషన్లో రజాకార్ల ఆగడాలను చూపెడతామంటున్న ఆ పార్టీ.. దాంతో పాటుగా 1948 పోలీస్‌ యాక్షన్‌లో జరిగిన ప్రాణనష్టాన్ని, సంఘటనలనూ ప్రదర్శించాలని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ గాంధీభవన్‌లో డిమాండ్‌ చేశారు.  


Updated Date - 2022-06-30T08:32:35+05:30 IST