టోర్నీలకు అనుమతించండి

ABN , First Publish Date - 2022-08-20T10:52:22+05:30 IST

భారత క్లబ్బులు శ్రీ గోకులం, కేరళ ఎఫ్‌సీ, ఏటీకే మోహన్‌ బగాన్‌లను టోర్నీలలో ఆడేందుకు అనుమతించాలని అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సంఘం (ఫిఫా),..

టోర్నీలకు అనుమతించండి

ఫిఫాకు క్రీడా శాఖ వినతి

న్యూఢిల్లీ: భారత క్లబ్బులు శ్రీ గోకులం, కేరళ ఎఫ్‌సీ, ఏటీకే మోహన్‌ బగాన్‌లను టోర్నీలలో ఆడేందుకు అనుమతించాలని అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సంఘం (ఫిఫా), ఆసియా ఫుట్‌బాల్‌ కన్ఫెడరేషన్‌ (ఏఎ్‌ఫసీ)లను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కోరింది. ఏఎ్‌ఫసీ ఉమెన్స్‌ క్లబ్‌ చాంపియన్‌షి్‌పలో పాల్గొనేందుకు గోకులం కేరళ మహిళల జట్టు ఇప్పటికే ఉజ్బెకిస్థాన్‌ వెళ్లింది. అయితే ఏఐఎఫ్‌ఎ్‌ఫపై ఫిఫా సస్పెన్షన్‌ విధించిన నేపథ్యంలో ఉజ్బెక్‌ టోర్నీలో కేరళ జట్టు పాల్గొనవచ్చా లేదా అనే అంశంపై గందరగోళం ఏర్పడింది. అలాగే సెప్టెంబరు 9న బహ్రెయిన్‌లో ఏఎ్‌ఫసీ కప్‌ (ఇంటర్‌ జోన్‌ సెమీ్‌స)లో మోహన్‌ బగాన్‌ తలపడాలి. యువ క్రీడాకారిణుల భవిష్యత్తు రీత్యా జట్టును టోర్నీలో పోటీపడేందుకు అనుమతించాలని ఫిఫాను కోరినట్టు క్రీడా శాఖ వివరించింది. 

Updated Date - 2022-08-20T10:52:22+05:30 IST