ఫిబ్రవరి రేషన్‌కు మరో అవకాశం

ABN , First Publish Date - 2021-03-05T09:15:49+05:30 IST

ఫిబ్రవరి కోటా రేషన్‌ తీసుకోని కార్డుదారులు ఈ నెల 6 నుంచి 10 వరకు.. ఈ నెలతో కలిపి రెండు నెలల రేషన్‌ను ఒకేసారి తీసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ కోన

ఫిబ్రవరి రేషన్‌కు మరో అవకాశం

రెండు నెలల సరుకులు ఒకేసారి తీసుకోవచ్చు


అమరావతి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ఫిబ్రవరి కోటా రేషన్‌ తీసుకోని కార్డుదారులు ఈ నెల 6 నుంచి 10 వరకు.. ఈ నెలతో కలిపి రెండు నెలల రేషన్‌ను ఒకేసారి తీసుకోవచ్చని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. గత నెల రేషన్‌ కోల్పోతామని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని,  పోర్టబులిటీ విధానంలో ఏ వాహనం వద్ద అయినా సరుకులు తీసుకోవచ్చని తెలిపారు. ఈ నెల పట్టణాల్లో రేషన్‌ పంపిణీ ప్రారంభమైదని, గ్రామీణ ప్రాంతాల్లో 6న మొదలవుతుందని పేర్కొన్నారు. ప్రతినెలా రాష్ట్రంలో సగటున 85శాతం పంపిణీ జరుగుతుంటే, ఫిబ్రవరిలో 86శాతం మంది సరుకులు తీసుకున్నారని ఆయన వివరించారు.

Updated Date - 2021-03-05T09:15:49+05:30 IST