భయం.. భయం

ABN , First Publish Date - 2021-11-10T05:28:25+05:30 IST

భయం.. భయం

భయం.. భయం

సరిహద్దు దాటుతున్న పులులు

వలస వస్తున్నా పట్టించుకోని అటవీ శాఖ

కాళేశ్వరం టైగర్‌ రిజర్వు ఏర్పాటులో నిర్లక్ష్యం

ట్రాక్‌ చేయడంలోనూ వైపల్యం

తాడ్వాయి, మంగపేట అడవుల్లో తాజా ఘటనలతో సర్వత్రా ఆందోళన

 (ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి)

భూపాలపల్లి, ములుగు జిల్లా సరిహద్దు మహా రాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ర్టాల్లో దండకారణ్యం ఉంది. మహారాష్ట్రలో తాడోబా, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతిలో టైగర్‌ రిజర్వ్‌ ఫారస్ట్‌ ఉండగా  అక్కడి నుంచి పెద్దపు లులు గోదావరి దాటి భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోకి ప్రవేశిస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబరు 3న భూపాలపల్లి మండలం ఆజంనగర్‌, మహముత్తారం మండలం యమనపల్లి గ్రామాల మధ్య అడవుల్లో తొలిసారి పెద్దపులి అడుగులు కనిపించాయి. ఆ తర్వాత ములుగు జిల్లా కన్నాయిగూడెం, తాడ్వాయి, మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ అడవుల్లో పులి కదిలికలు కనిపించాయి. అక్టోబరు 28న భూపాలపల్లి జిల్లాకు సరిహద్దులోని మేడిగడ్డ బ్యారేజీకి అవతలి వైపు మహారాష్ట్రలోని సిరొంచ తాలుకా పెంటిపాక అడవుల్లో దుర్గం మల్లయ్య అనే మేకల కాపరిని పులి దాడి చేసి హతమార్చింది. ఏడాది కాలంగా పులులు ఛత్తీస్‌గఢ్‌ నుంచి గోదావరి తీరం దాటుతూ భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోకి వలస వస్తున్నాయి.

ఒక పెద్దపులి స్వేచ్ఛగా జీవించాలంటే కనీసం 40 చదరపు కిలో మీటర్ల అడవి దట్టంగా ఉండాలి. అంతే కాకుండా దానికి కావాల్సిన ఆహారం కూడా ఆ ప్రాం తంలో ఉం డాలి. భూపాలపల్లి జిల్లాలో మహదేవ పూర్‌, పలిమెల, మల్హర్‌, మహముత్తారం, భూపాల పల్లి, ములుగు జిల్లాలో కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, తాడ్వా యి, మంగపేట, గోవిందరావుపేట మండలాల్లో అడ వులు ఎక్కువగా ఉన్నాయి. ఈ అడవుల్లో పెద్ద పులులకు కావాల్సిన ఆహారం పుష్క లంగా ఉన్నట్టు ఫారెస్టు అధికారులు అంటున్నారు.

టైగర్‌ జోన్‌కు మోక్షమెప్పుడో..?

సరిహద్దులోని భూపాలపల్లి, ములుగు జిల్లాలకు పులులు వలస బాట పడుతున్నప్పటికీ అటవీ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మూడెళ్ల క్రితం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కేటీపీపీలో మూడు రాష్ర్టాల అటవీ శాఖ అధికారులు సమావేశమయ్యారు. పులులు వలస బాట పట్టకుండా కట్టుదిట్ట చర్యలు చేపట్టాలని కార్యాచరణను రూపొందించారు. ఇందులో భాగంగా  కాళేశ్వరం టైగర్‌ రిజర్వు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే.. ఇది నేటికీ అమలుకు నోచు కోలేదు. కాళేశ్వరం టైగర్‌ జోన్‌కు ప్రతిపాదనలు చేసి మూడేళ్లవుతున్నా ఇంకా మోక్షం కలగలేదు.

అడవుల్లో అలజడి

తాడ్వాయి మండలం  కొడిశాల అడవుల్లో  పెద్ద పులి హత్య తర్వాత తాజా సంటనలు మళ్లీ కలకలం రేపుతున్నాయి. తాడ్వాయి, మంగపేట అడవుల్లో పెద్దపులి జాడలు కనిపిస్తున్నాయి. రెండు రోజులుగా పశువులపై పెద్దపులి దాడి చేయడం ఏజెన్సీ వాసు ల్లో భయాందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో పులి అడుగులను అటవీ శాఖ అధికారులు గుర్తించే పనిలో పడ్డారు. ఒకవైపు అడవులు దాటి వస్తున్న పులులు  వేట గాళ్ల చేతుల్లో హత్యకు గురవుతుం డగా మరోవైపు అవి పశువులపై పంజా విసురు తుండటం చర్చనీయాంశమైంది. ఈ ఘటనలను అటవీ శాఖ అధికారులు ఆషా మాషిగా తీసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. 

మరోవైపు కాళే శ్వరం టైగర్‌ రిజర్వుతో పాటు ఏటూరునా గారంఆభయారణ్యంలో పులుల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ ను అమ లు చేయాలని అం టున్నారు.

Updated Date - 2021-11-10T05:28:25+05:30 IST