హెటెరో నుంచి ‘ఫావివిర్‌ 800/200’ ప్యాక్‌

ABN , First Publish Date - 2020-09-26T06:37:46+05:30 IST

కొవిడ్‌-19 చికిత్సలో వినియోగించే జెనరిక్‌ యాంటీ వైరల్‌ ఔషధం ఫావివిర్‌ 800/200 టాబ్లెట్లను ప్రత్యేకమైన ప్యాక్‌తో తీసుకువచ్చినట్లు హెటెరో వెల్లడించింది...

హెటెరో నుంచి ‘ఫావివిర్‌ 800/200’ ప్యాక్‌

  • ధర రూ.2,640


హైదరాబాద్‌ : కొవిడ్‌-19 చికిత్సలో వినియోగించే జెనరిక్‌ యాంటీ వైరల్‌ ఔషధం ఫావివిర్‌ 800/200 టాబ్లెట్లను ప్రత్యేకమైన ప్యాక్‌తో తీసుకువచ్చినట్లు హెటెరో వెల్లడించింది. 800 ఎంజీ సామర్థ్యంతో కూడిన 16 ఫావిపిరవిర్‌ టాబ్లెట్లు, 200 ఎంజీ సామర్థ్యం కలిగిన రెండు ఫావిపిరవిర్‌ టాబ్లెట్లతో ఫావివిర్‌ 800/200 ప్యాక్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది. తొలిసారిగా పేషంట్‌ కంప్లైంట్‌ ప్యాక్‌ పేరుతో తీసుకువచ్చిన దీని ధర రూ.2,640. అధిక మోతాదుతో కూడిన 800 ఎంజీ ఫావిపిరవిర్‌కు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఆమోదం తెలిపిందని హెటెరో పేర్కొంది. ఫావివిర్‌ ప్యాక్‌.. మార్కెటింగ్‌, పంపిణీ వ్యవహారాలను హెటెరో హెల్త్‌కేర్‌  చేపడుతుందని తెలిపింది.

Updated Date - 2020-09-26T06:37:46+05:30 IST