వ్యాక్సిన్‌కు లొంగని వేరియంట్ల భయం.. ఫౌచీ భయం నిజమవుతుందా?

ABN , First Publish Date - 2021-08-05T12:21:33+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాల్లో కరోనా డెల్టా వేరియంట్ విపరీతంగా వ్యాపిస్తోంది. భారతదేశంలో తొలిగా

వ్యాక్సిన్‌కు లొంగని వేరియంట్ల భయం.. ఫౌచీ భయం నిజమవుతుందా?

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాల్లో కరోనా డెల్టా వేరియంట్ విపరీతంగా వ్యాపిస్తోంది. భారతదేశంలో తొలిగా వెలుగు చూసిన ఈ వేరియంట్ భారత్‌లో ఎంతటి విలయాన్ని సృష్టించిందో తెలిసిందే. ఇటీవలి కాలంలో బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా సహా పలు దేశాల్లో ఈ వేరియంట్ చాలా వేగంగా వృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథనీ ఫౌచీ సంచలన వ్యాఖ్యలు చేశారు.


భవిష్యత్తులో వ్యాక్సిన్లకు లొంగని వేరియంట్లు అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘కరోనా గనుక ఇలాగే వ్యాపిస్తూ ఉంటే.. మరోసారి దీని మ్యూటేషన్ జరగొచ్చు. అలా ఏర్పడే వేరియంట్ ఇప్పుడున్న వ్యాక్సిన్లకు లొంగనిదయ్యే ప్రమాదం ఉంది’’ అని ఫౌచీ హెచ్చరించారు. అలాగే అమెరికాలో డెల్టా వ్యాపిస్తున్న వేగం ఇలానే కొనసాగితే వచ్చే కొన్ని వారాల్లోనే అమెరికాలో రోజుకు 2లక్షల కరోనా కేసులు నమోదవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. గడిచిన నెల రోజుల్లో అమెరికాలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 350శాతం పెరుగుదల కనిపించింది. ఇదంతా డెల్టా వేరియంట్ వల్లే అని గణాంకాలు చెప్తున్నాయి.

Updated Date - 2021-08-05T12:21:33+05:30 IST