అదృష్టం కోసమని కన్న కూతురని కూడా చూడకుండా దారుణంగా..

ABN , First Publish Date - 2020-06-04T23:12:31+05:30 IST

మాత్రింకురాలి మాటలు నమ్మి కన్న కూతురిని పొట్టను పెట్టుకున్నాడో తండ్రి. అదృష్టం కలిసొస్తుందని నమ్మి మైనర్ బాలికను ఆ దుర్మాగుడు కడతేర్చాడు.

అదృష్టం కోసమని కన్న కూతురని కూడా చూడకుండా దారుణంగా..

పుదుకొట్టాయ్: మాత్రింకురాలి మాటలు నమ్మి కన్న కూతురిని పొట్టను పెట్టుకున్నాడో తండ్రి. అదృష్టం కలిసొస్తుందని భావించి మైనర్ బాలికను ఆ దుర్మాగుడు కడతేర్చాడు. మే 19న తమినాడు పుదుకొట్టాయ్ జిల్లాలో జరిగిన ఓ దారుణ హత్య వెనుక మిస్టరీని పోలీసులు ఇటీవల ఛేదించడంతో ఈ విషయం వెలుగు లోకి వచ్చింది. పన్నీర్ సెల్వం  అనే నిందితుడు తన రెండో బార్యతో కలసి మొదటి భార్య కుమార్తెను గొంతు నులిమి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. కూతురిని పైలోకాలికి పంపిస్తే అదృష్టం వరిస్తుందని ఓ మాంత్రికురాలు సూచించడంతో తాను హత్య చేసానని నిందితుడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. దీంతో నిందితులపై హత్యనేరం కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2020-06-04T23:12:31+05:30 IST