కరీంనగర్: తల్లి లేని బిడ్డలు అని కూడా చూడకుండా పిల్లలను చిత్ర హింసలు పెడుతున్న తండ్రి వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తండ్రి కొడుతుండడంతో భయంతో రోడ్డుపైకి పిల్లలు పరుగులు తీసారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పిల్లలను రక్షించి వైద్యం కోసం కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించారు. జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.