భూవివాదంతో రైతు ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-06-20T05:25:24+05:30 IST

భూవివాదంతో రైతు ఆత్మహత్యాయత్నం

భూవివాదంతో రైతు ఆత్మహత్యాయత్నం

అధికార పార్టీ నేత, పోలీసుల వేధింపులే కారణమని ఆరోపణ

న్యాయం చేయాలని కాంగ్రెస్‌ శ్రేణుల రాస్తారోకో

 చిట్యాల, జూన్‌ 19: భూవివాదం నేపథ్యంలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇందుకు అధికార పార్టీ నాయ కుడు, పోలీసులే కారణమని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ నేతలు రాస్తారోకో చేశారు. ఈ సంఘటన మండలంలోని చింతకుంటరామయ్యపల్లిలో ఆదివారం సాయం త్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

గ్రామానికి చెందిన పడిదల సంపత్‌రావు, మడికొండ శ్రీనివాసరావు మధ్య  కొంతకాలంగా  భూవివాదం ఉంది. సంపత్‌రావు రెండేళ్ల క్రితం శ్రీని వాసరావుకు రెండెకరాల వ్యవసాయ భూమి విక్రయించగా ఆ సమయంలో రిజిస్ర్టేషన్‌ చేయించుకోలేదు. రిజిస్ర్టేష న్‌ను చేయించమని శ్రీనివాసరావు కోరగా ప్రస్తుత మార్కెట్‌ ఽధర ప్రకారం డబ్బులు ఇస్తేనే చేయిస్తానని సంప త్‌రావు తెలిపాడు. ఈవిషయమై పలుమార్లు పెద్దమ నుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. అయినా వివాదం సద్దుమణ గలేదు. ఇదే క్రమంలో ఇరువురు పరస్పరంగా పోలీసులకు ఫిర్యాదు చేసుకు న్నారు. శ్రీనివాసరావు సోదరుడు అధికార పార్టీ నాయకుడు కావడంతో పోలీసులు అతడికి అను కూలంగా వ్యవహ రిస్తున్నారని సంపత్‌రావు మనస్తాపం చెందాడు. ఇంటి వద్ద ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో  కుటుంబ సభ్యులు చిట్యాల సామాజిక ఆస్పత్రికి తరలించారు. అధికార పార్టీ నాయకులు, పోలీసుల వేధింపులతోనే సంపత్‌రావు ఆత్మహత్యాయత్నం చేశాడని కాంగ్రెస్‌ నాయ కులు, పలువురు రైతులు మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రాస్తా రోకో చేశారు. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి, సర్పంచ్‌ మధువంశీకృష్ణ, రైతులు తీగల సుధాకర్‌రావు, రాజేశ్వర్‌రావు, పిట్టల సాంబ య్య, రాజకొమురు, బుచ్చారావు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం సంపత్‌రావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, ఆయన ఆరోగ్యం నిలక డగానే ఉందని గ్రామస్థులు తెలిపారు. 

Updated Date - 2022-06-20T05:25:24+05:30 IST