బాక్సింగ్‌కు పకియావ్‌ గుడ్‌బై

ABN , First Publish Date - 2021-09-30T09:01:33+05:30 IST

లిప్సీన్స్‌ బాక్సింగ్‌ దిగ్గజం మాని పకియావ్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. సెనేటర్‌ కూడా అయిన 42 ఏళ్ల పకియావ్‌.. వచ్చే ఏడాది జరిగే తనే దేశ అధ్యక్ష ఎన్నికలలో బరిలోకి దిగేందుకు..

బాక్సింగ్‌కు పకియావ్‌ గుడ్‌బై

మనీలా: ఫిలిప్సీన్స్‌ బాక్సింగ్‌ దిగ్గజం మాని పకియావ్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. సెనేటర్‌ కూడా అయిన 42 ఏళ్ల పకియావ్‌.. వచ్చే ఏడాది జరిగే తనే దేశ అధ్యక్ష ఎన్నికలలో బరిలోకి దిగేందుకు సమాయత్తమవుతున్నాడు. ఎనిమిది వేర్వేరు డివిజన్లలో వరల్డ్‌ టైటిల్స్‌ సాధించిన ఏకైక బాక్సర్‌ పకియావ్‌. బుధవారం ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన 14 నిమిషాల భావోద్వేగ వీడియోలో తాను బాక్సింగ్‌ రింగ్‌ను వీడుతున్నట్టు తెలిపాడు. పకియావ్‌ తన 26 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 72 బౌట్లలో 62 విజయాలు సాధించాడు. 

Updated Date - 2021-09-30T09:01:33+05:30 IST