Abn logo
Aug 21 2020 @ 20:11PM

ప్రభాస్‌పై వినూత్నంగా అభిమానం చాటుకున్న జపాన్ ఫ్యాన్స్!

టోక్యో: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు తెలుగు రాష్ట్రాలు, భారతదేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు హృదయాలను డార్లింగ్ గెలుచుకున్నాడు. ఈ నేపథ్యంలో జపాన్‌లో ఉన్న ప్రభాస్ అభిమానులు.. తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. డార్లింగ్ ప్రభాస్ పేరట క్యాండీలను తయారు చేసి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే.. గతంలో చైనాలోని ప్రభాస్ అభిమానులు.. డార్లింగ్ ఫొటోలతో గాజు పాత్రలను తయారు చేసి, అమ్మారు. కాగా.. బాహుబలి తర్వాత ప్రభాస్.. ‘సాహో’ సినిమా ద్వారా ప్రజల అంచనాలను అందుకోలేకపోయిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement
Advertisement